పెళ్లకూరు: విద్యుదాఘాతంతో యువకుడి దుర్మరణం

494చూసినవారు
పెళ్లకూరు: విద్యుదాఘాతంతో యువకుడి దుర్మరణం
నందమాల గ్రామంలో శనివారం గంధం వీరస్వామి (23) అనే యువకుడు విద్యుత్తు నియంత్రిక వద్ద స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతంతో మృతి చెందారు. పొలాల్లోని పంపుసెట్టుకు విద్యుత్తు సరఫరా కాకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. ఘటనపై ఎస్సై నాగరాజు పరిశీలించి వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్