గూడూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఫొన్ చూస్తూ ఆడుకుంటుండగా చెలరేగిన వివాదంలో ఓ బాలుడు మరో బాలుడి ప్రాణాలు తీశాడు. మర్రిపల్లిమడుగు ప్రాంతంలోని ఒక తోటలో ఇద్దరు బాలల తల్లిదండ్రులు పని చేస్తున్నారు. చెన్నూరుకు చెందిన బాలుడు (8), సైదాపురంకు చెందిన బాలుడు (17) ఫొన్ చూస్తూ ఆడుకుంటున్నారు. ఉన్నట్టుండి ఇద్దరి మధ్య గొడవ చేలరేగడంతో 17 ఏళ్ల బాలుడు గొంతు నులుమడంతో మరో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని ఏం చేయాలో తెలియక తోటలోనే పూడ్చేశాడు.