గూడూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని 348 రోజులుగా నిరసనలు

6చూసినవారు
తిరుపతి జిల్లా గూడూరులో బుధవారం గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగాయి. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గత 348 రోజులుగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. గాంధీ బొమ్మ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు కంకణాల పెంచలనాయుడు మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నాటి ఈ డివిజన్ కేంద్రానికి సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని, దీనిని జిల్లా కేంద్రం చేయడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్