ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు
తిరుపతి జిల్లా గూడూరు మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. మండలంలోని విందూరు, సంతదాసు పల్లి, రామలింగాపురం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు గురువారం ఉదయం నుండే పెద్ద సంఖ్యలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్ల రాకతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది.