భర్త చేతిలో భార్య హతం
గూడూరు మండలం వెడిచర్ల గ్రామంలోని ST కాలనీ నందు నివాసం ఉంటున్న ఆదూరి శైలజ భర్త ముని కృష్ణయ్య చేతిలో హతమయింది. 15 సంవత్సరాల క్రితం వివాహమై, ఇద్దరు కుమారులు సంతానం ఉన్నట్లు, అయితే శైలజ ను తన భర్త ముని కృష్ణయ్య అనుమానిస్తు తరచుగా వారికి గొడవలు జరుగుతుండినట్లు, ఆ క్రమంలో బుధవారం తమ ఇంటి వద్ద ముని కృష్ణయ్య మద్యం మత్తులో తన భార్యను కొట్టి చంపినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.