
కోవూరులో కాల్పుల కలకలం
కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద శనివారం జరిగిన హత్య కేసులో నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న రాత్రి కల్లూరుపల్లిలో పెంచలయ్య అనే వ్యక్తిని గంజాయి బ్యాచ్ నిందితులు హత్య చేశారు. షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్న నిందితులను పట్టుకునే ప్రయత్నంలో, జేమ్స్ అనే నిందితుడు కత్తితో పోలీసులపై దాడి చేయడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ ఆదినారాయణతో పాటు జేమ్స్ కు గాయాలయ్యాయి.





































