
స్కేటింగ్ కాంపిటీషన్ లో సత్తా చాటిన కుప్పం విద్యార్థి
నేపాల్లో జరిగిన అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో కుప్పం మండలం వానగుట్టపల్లికి చెందిన ఐదో తరగతి విద్యార్థి అర్జున్ ప్రథమ బహుమతి సాధించాడు. సర్పంచ్ రామచంద్ర, కల్పన దంపతుల కుమారుడైన అర్జున్ విజయం కుప్పం వాసుల్లో ఆనందాన్ని నింపింది. ఈ ఘనత సాధించిన అర్జున్ ను స్థానికులు అభినందిస్తున్నారు.


































