కుప్పం రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు

407చూసినవారు
కుప్పం రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు
చిత్తూరు జిల్లా, కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. గతంలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మాజీ సబ్ రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్య, జూనియర్ అసిస్టెంట్ మోహన్ తో పాటు మరికొంతమంది సాక్షులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వెంకటసుబ్బయ్య కడప ఆడిటర్ గా, మోహన్ రిజిస్ట్రార్ డిపార్ట్మెంట్ డిఐజి కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఈ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్