గోనుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999-2000 బ్యాచ్ పూర్వ
విద్యార్థులు, ఉపాధ్యాయుల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. 26 ఏళ్ల తర్వాత జరిగిన ఈ ఆత్మీయ కలయిక కార్యక్రమానికి పి.బి. బాలసుబ్రమణ్యం, ఎస్. అర్ముగం కార్య నిర్వాహకులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జై రఘు ప్రసాద్, చెంచయ్య వేణుగోపాల్, పరమాత్మయ, దామోదయ, కమలాక్షి వంటి ఉపాధ్యాయులతో పాటు వెంకటేష్, మునిరత్నం, హేమ రాజు, విష్ణువర్ధన్, సుధాకర్, జ్యోతి, చైతన్య, మంజుల వంటి
విద్యార్థులు పాల్గొన్నారు.