ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని నాయక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు, 5,555 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం గిన్నిస్ రికార్డ్ సృష్టించనుంది. గతంలో కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా జలాల ద్వారా ప్రతి నీటి చెరువుకు నీరందించడం జరిగిందని, ఇది ప్రతి రైతు కళ్ళల్లో ఆనందాన్ని నింపిందని తెలిపారు.