కుప్పం చేరుకున్న సీఎం చంద్రబాబు..ఘన స్వాగతం పలికిన అధికారులు

3374చూసినవారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం చిత్తూరు జిల్లాలోని కుప్పం పర్యటనకు విచ్చేయగా, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్, ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ తో పాటు పలువురు టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్