ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ. 11,359 కోట్ల విలువైన అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అభివృద్ధి కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు.