నేటి నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

536చూసినవారు
నేటి నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
నేటి నుంచి మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, మధ్యాహ్నం 2 గంటలకు గుడుపల్లి మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌లో టీచర్ ట్రైనింగ్ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అనంతరం, కుప్పం మున్సిపాలిటీలో ప్రభుత్వ గ్రంథాలయం, ఆదిత్య బిర్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తారు. కంగుందిలో హెరిటేజ్ సైట్ డెవలప్‌మెంట్ వర్క్స్, బౌల్డరింగ్ పార్క్ ప్రారంభోత్సవం కూడా ఉంటుంది. ఈ సందర్భంగా వంద అడుగుల ఎత్తైన జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

సంబంధిత పోస్ట్