కుప్పం పశువైద్యశాలకు విధాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 65 వేలు విలువ చేసే కంప్యూటర్ ను విరాళం ఇచ్చారు. చిత్తూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ టి. గోవిందయ్య, కుప్పం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్. జె. వెంకటేశ్వర్లు కు కంప్యూటర్ ను అందజేసి, ప్రభుత్వ కార్యాలయాలలో డిజిటల్ సేవలు విస్తరించడానికి తమ వంతు సహకారం అందించామని ఫౌండేషన్ వ్యవస్థాపకులు కళాడి విష్ణువర్ధన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ధాతకు అధికారులు కృతజ్ఞతలు తెలియచేశారు.