నెమలి ఈకపై శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చిత్రం: కళాకారుడికి భక్తుల ప్రశంసలు

4చూసినవారు
నెమలి ఈకపై శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చిత్రం: కళాకారుడికి భక్తుల ప్రశంసలు
ఆడి కృత్తిక ఉత్సవాల సందర్భంగా, కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలానికి చెందిన చిత్రకారుడు పూరి ఆర్ట్స్ పురుషోత్తం, నెమలి ఈకపై శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చిత్రాన్ని చిత్రించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రతి సంవత్సరం ఆడి కృత్తిక ఉత్సవాలను పురస్కరించుకుని, భక్తులు గుడిపల్లిలోని గుడివంక శ్రీవల్లి దేవత సేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ నేపథ్యంలోనే తాను ఈ చిత్రాన్ని వేసినట్లు పురుషోత్తం తెలిపారు. ఆయన కళాఖండాన్ని చూసిన భక్తులు వివిధ మాధ్యమాల ద్వారా పురుషోత్తంను అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్