కుప్పంలో 5,555 ఈ-సైకిళ్ల పంపిణీ: గిన్నిస్ రికార్డుకు సిద్ధం

1102చూసినవారు
కుప్పంలో 5,555 ఈ-సైకిళ్ల పంపిణీ: గిన్నిస్ రికార్డుకు సిద్ధం
కుప్పంలో 5,555 ఈ-సైకిళ్లను 24 గంటల వ్యవధిలో పంపిణీ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించనున్నట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ-సైకిళ్ల పంపిణీ జరగనుంది. గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ పంపిణీని రికార్డ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల కుప్పం పర్యటన శుక్రవారం నుండి ప్రారంభమవుతుంది. ఈ నెల 31న సీఎం బహిరంగ సభలో గిన్నిస్ రికార్డును అందజేయనున్నట్లు ఎమ్మెల్సీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్