కుప్పంకు కృష్ణాజలాలు: సీఎం చంద్రబాబు జలహారతి

0చూసినవారు
కుప్పంకు కృష్ణాజలాలు: సీఎం చంద్రబాబు జలహారతి
హంద్రీ–నీవా కుప్పం బ్రాంచి కెనాల్‌కు చేరిన కృష్ణాజలాలకు శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లె వద్ద సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం జలహారతి ఇచ్చారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రతి చెరువుకూ నీరందించి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యమని, 418 చెరువులకు నీరందించేందుకు రూ. 439. 64 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కలెక్టర్ సుమిత్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్