కుప్పం: గురుకుల పాఠశాలలో ప్రవేశానికి అడ్మిషన్లు

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని కడపల్లి సమీపంలో ఉన్న డా. బి. ఆర్. అంబేడ్కర్ గురుకులంలో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఖైరున్నిషా బుధవారం తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆసక్తి ఉన్న విద్యార్థులు FRB-19వ తేదీ సాయింత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తమ దరఖాస్తులను www.apbragcet.apcfss.in వెబ్ సైట్ నందు అప్లై చేసుకోవాలని అన్నారు.
