కుప్పం మండలం, పెద్ద గోపనపల్లిలో బుధవారం ఏఓ ఫయాజ్ రైతులతో సమావేశమయ్యారు. అన్నదాత సుఖీభవ నగదు ఖాతాల్లో జమ అయిందా లేదా అని ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు సేవ కేంద్రం సిబ్బంది పనితీరు, ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారా లేదా అనే విషయాలను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని, ఏవైనా సమస్యలుంటే తనను నేరుగా సంప్రదించవచ్చని ఏఓ ఫయాజ్ రైతులకు సూచించారు.