కుప్పం: ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

2697చూసినవారు
కుప్పం: ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
కుప్పం మండలం, పొన్నంగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం 'ధైర్య స్పర్శ, మీ భద్రత మా బాధ్యత' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మల్లేశ్ యాదవ్ మాట్లాడుతూ, 18 ఏళ్ల లోపు అమ్మాయిలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మహిళలు, పిల్లల భద్రత, సైబర్ నేరాలు, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, ఆన్‌లైన్ మోసాలు, డ్రగ్స్ దుష్పరిణామాలపై అధికారులు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్