శుక్రవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య హంద్రీనీవా జలాలకు హారతినిచ్చారు. ఈ సందర్భంగా గంగమ్మకు పసుపు, కుంకుమ, సారెను సమర్పించారు. హంద్రీనీవా జలాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.