కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా, ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో టీడీపీ శ్రేణుల సమావేశంలో యువగళం పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీకాంత్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.