కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం రాత్రి కంగుందిలో పర్యటించారు. ఇటీవల బౌల్డరింగ్ ఫెస్టివల్ జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. 'ఐ లవ్ కంగుంది' వద్ద నిలబడి ఫోటో దిగారు. కంగుందిలోని వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని సీఎం పేర్కొన్నారు.