కుప్పం: దళితుల సమస్యలపై ఫిర్యాదు చేసిన దళిత నేతలు

650చూసినవారు
కుప్పం: దళితుల సమస్యలపై ఫిర్యాదు చేసిన దళిత నేతలు
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, శాంతిపురానికి చెందిన దళిత నేతలు దేవా, బాలకృష్ణ, ఎల్లప్ప రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్ ను మర్యాదపూర్వకంగా కలిసి, కుప్పం ప్రాంతంలో దళితులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందజేశారు. దళిత శ్మశానాలకు దారి సమస్యతో పాటు ఎస్సీ, ఎస్టీ మానిటర్ కమిటీ సమావేశాలు వంటి అంశాలను వారు వినతిపత్రంలో ప్రస్తావించారు. ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని నాయకులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్