కుప్పం: కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమి పూజ

349చూసినవారు
కుప్పం: కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమి పూజ
చిత్తూరు జిల్లా, కుప్పం మున్సిపల్ కార్యాలయానికి రూ. 40 లక్షల వ్యయంతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సోమవారం భూమి పూజా కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం, స్థానిక నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ, కుప్పం పరిధిలో సీఎం చంద్రబాబు చొరవతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇందులో భాగంగా కార్యాలయం చుట్టూ కాంపౌండ్ వాల్, ప్రాంగణంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్