రామకుప్పం మండలం, పాల రేవు గడ్డ, చెల్లిని చేను, లక్ష్మీపురం, కంగుంది వైపు ఒంటరి ఏనుగు వచ్చే అవకాశం ఉన్నందున అటవీ సరిహద్దు గ్రామీణులు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లకూడదని అటవీశాఖ అధికారులు బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా అటవీశాఖ అధికారులకు సహకరించాలని సూచించారు.