ద్రవిడ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 5.3 కోట్లను మూడేళ్ల పాటు కేటాయించనున్నట్లు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య మల్లయ్య ఆదివారం తెలిపారు. విశ్వవిద్యాలయ ఆర్థిక వనరులు మెరుగుపడే వరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వీసీ పేర్కొన్నారు.