ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలో విజయవాడ, అనంతపురంలో తలసేమియా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్టీ నారా భువనేశ్వరి శుక్రవారం కుప్పంలో తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలో బ్లడ్ బ్యాంకులు నిర్వహిస్తున్నామని, త్వరలో విజయవాడలోనూ ప్రారంభించనున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు.