ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్ర
రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టాయని
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శించారు. శనివారం కుప్పంలో పర్యటించిన ఆయన, తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచినా ప్రజలు విజయ్ కే పట్టం కట్టారని గుర్తు చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు
కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.