కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం, రాళ్లబూదుగూరులో క్లస్టర్-2 బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ ఇంచార్జీలకు ఓటరు జాబితా సవరణపై శనివారం శిక్షణా కార్యక్రమం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం ముఖ్య అతిథిగా హాజరై, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పులు, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు.