కుప్పం: ఎందుకు మీరు ముందుకు రావట్లేదు: శ్రీకాంత్

344చూసినవారు
డిఎస్సీ పరీక్షల విషయంలో వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసిపి నాయకులు అడిగే ప్రతి ప్రశ్నకు తమ వద్ద సమాధానాలు ఉన్నాయని, అయినప్పటికీ వారు ముందుకు రావట్లేదని విమర్శించారు. టీచర్లు, నిరుద్యోగులు, ప్రజలు వైసిపి నాయకుల విష ప్రచారాలను గమనిస్తున్నారని, అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలకు ప్రజలే తగిన సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా బుద్ధి చెబుతారని శ్రీకాంత్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్