ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం తెలిపారు. జులై 3, 4, 5 తేదీల్లో సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనకు భారీగా
విద్యార్థులు, ప్రజలు రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.