సీఎం పర్యటనకు పోలీసుల ట్రయల్ రన్

7860చూసినవారు
సీఎం పర్యటనకు పోలీసుల ట్రయల్ రన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3 నుంచి 5 వరకు కుప్పం పర్యటన నేపథ్యంలో, చిత్తూరు జిల్లా పోలీసులు కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. జూలై 2న, ద్రావిడ విశ్వవిద్యాలయం హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్ మార్గాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్, అధికారులకు, సిబ్బందికి భద్రతా ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. పర్యటన ముగిసే వరకు అప్రమత్తంగా విధులు నిర్వహించి, ఎలాంటి భద్రతా లోపాలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్