కుప్పం నియోజకవర్గం, గుడిపల్లి మండలం శెట్టిపల్లి గ్రామంలోని ఎం. పి. పి. పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మునిరత్నం తల్లిదండ్రులకు పోలియో నివారణపై అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.