రామకుప్పం: పాడి రైతులకు సబ్సిడీతో పశుదాణా

2284చూసినవారు
రామకుప్పం: పాడి రైతులకు సబ్సిడీతో పశుదాణా
కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం, గిడ్డపల్లిలో మంగళవారం తెలుగుదేశం పార్టీ నేతలు 50 శాతం సబ్సిడీతో పాడి రైతులకు పశుదాణా, మొక్కజొన్న విత్తనాలు పంపిణీ చేశారు. కుప్పం ప్రాంతంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా రూ. 1100 విలువైన 50 కేజీల పశుదాణాను రూ. 550కే రైతులకు అందిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్