కుప్పం RTC బస్టాండ్ నిర్మాణానికి రూ.117.75 కోట్లు మంజూరు

2చూసినవారు
కుప్పం RTC బస్టాండ్ నిర్మాణానికి రూ.117.75 కోట్లు మంజూరు
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆధునిక వసతులతో కూడిన కొత్త RTC బస్టాండ్, డిపో నిర్మాణానికి ప్రభుత్వం రూ. 117.75 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న బస్టాండ్‌ను పూర్తిగా తొలగించి నూతన నిర్మాణం చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జులై 4వ తేదీన కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఈ బస్టాండ్, డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బస్టాండ్ కూడలిలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.
Job Suitcase

Jobs near you