గుడుపల్లి మండలం పొగురుపల్లిలోని ABIS కంపెనీలో జరిగిన కాపర్ వైర్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులు ఎం. మధు, వి. సంతోష్, వి. మురుగన్, ఎ. విజయ్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 15 లక్షల విలువైన 280 కిలోల కాపర్ వైర్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన వైర్లను కుప్పం, తమిళనాడులోని పాత సామాన్ల షాపుల్లో విక్రయించినట్లు విచారణలో తేలింది. కేసును వేగంగా ఛేదించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ అభినందించారు.