కుప్పం పట్టణంలో ఆదివారం నాడు ఓ విద్యార్థిపై వీధి కుక్కలు దాడికి ప్రయత్నించిన ఘటన సీసీటీవీలో నమోదైంది. ప్రసాద్ మార్ట్ సమీపంలో
క్రికెట్ కిట్టుతో వెళ్తున్న విద్యార్థిపై నాలుగు కుక్కలు ఒకేసారి దాడి చేయడానికి ప్రయత్నించాయి. అయితే, విద్యార్థి చాకచక్యంగా పరిగెత్తి కుక్కల బారి నుంచి తప్పించుకున్నాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం బయటకు వచ్చాయి.