విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థి కె. ఎన్. సురేష్ బాబు బుధవారం ఎల్ ఇ డి ప్రాజెక్టర్ ను వితరణగా అందజేశారు. ప్రధానోపాధ్యాయులు వెoకమరాజు మాట్లాడుతూ, తరగతిగదిలో సాంకేతిక పరిజ్ఞానం అవసరమని, దీని సహాయంతో ప్రపంచ విషయ పరిజ్ఞానాన్ని
విద్యార్థులు పొందవచ్చని తెలిపారు. దాతను విద్యా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురలక్ష్మి, సురేష్, సుబ్రహ్మణ్యం, సుజాత పాల్గొన్నారు.