జాతీయ రహదారి గోతులతో దుకాణదారుల ఆవేదన

725చూసినవారు
జాతీయ రహదారి గోతులతో దుకాణదారుల ఆవేదన
నగరిలో తాగునీటి పైపులైన్ల ఏర్పాటు పనుల్లో భాగంగా జాతీయ రహదారి అధికారులు తవ్విన గోతులు మూయకపోవడంతో దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారి నుంచి దుకాణాలకు వెళ్లే మార్గంలో అడ్డంగా గోతులు ఉండటంతో కొయ్యపలకలు వేసి దారి ఏర్పాటు చేసుకున్నారు. కొనుగోలుదారులు వాటిపై రావడానికి భయపడటంతో వ్యాపారాలు మందగించాయని, పైపులైన్ పనుల వల్ల ఇప్పటికే వ్యాపారం తగ్గిందని, ఇప్పుడు ఈ గోతుల వల్ల పూర్తిగా వ్యాపారాలు జరగడం లేదని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్