నగరిలో ఘోర రోడ్డు ప్రమాదం: టిప్పర్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి

5చూసినవారు
నగరిలో ఘోర రోడ్డు ప్రమాదం: టిప్పర్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి
నగరి మండలం మండపం సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకుపై వెళ్తున్న ఇద్దరు యువకులను అతివేగంగా వచ్చిన టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నగరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్