నగరిలో
వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా, నాయకులతో కలిసి స్కూటీపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.