విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ పాఠశాల విద్యా కమిటీ
ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గాదిరాజు జయరామరాజును చైర్మన్గా, గోవిందమ్మను వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రధానోపాధ్యాయులు వెoకమరాజు, ఉపాధ్యాయులు సురలక్ష్మి, సురేష్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.