నిండ్ర మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు

1250చూసినవారు
నిండ్ర మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు
అల్పపీడన ద్రోణి ప్రభావంతో చిత్తూరు జిల్లాలోని 19 మండలాలలో ఆదివారం మధ్యాహ్నం నుంచి వర్షం కురిసింది. సోమవారం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, నిండ్రలో అత్యధికంగా 65.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరిలో 51.2, పాలసముద్రంలో 47.4, శాంతిపురంలో 24.8, గుడిపాల 23.0, కుప్పం 22.2, జీడి నెల్లూరులో 19.2, చిత్తూరు రూరల్లో 18.2, కార్వేటినగరంలో 17.6, పెనుమూరులో 10.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్