నగరి: ఈ సైకిల్ పంపిణీలో కూటమి ప్రభుత్వం గిన్నిస్ రికార్డు

742చూసినవారు
నగరి: ఈ సైకిల్ పంపిణీలో కూటమి ప్రభుత్వం గిన్నిస్ రికార్డు
నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శనివారం నగిరి మున్సిపాలిటీలో వేలాది ఈ-సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ-సైకిళ్ల పంపిణీలో కూటమి ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిందని ఆయన తెలిపారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ఈ-సైకిళ్లు ఎంతో ఉపయోగపడతాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్