నగరి రూరల్ మండలం, చిన్న తంగళ్ గ్రామంలోని మునీశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కుంభాభిషేక వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. మాజీ మంత్రి రోజా ఈ పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను నిర్వాహకులు ఆమెకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి కృషి చేసిన దాతలను ఈ సందర్భంగా అభినందించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.