నగరి: గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

217చూసినవారు
నగరి: గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ లో 2029 నాటికి ప్రతి కుటుంబానికి సొంత ఇంటిని అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గృహాల పంపిణీని చేపట్టింది. మొదటి విడతలో 3,00,192 ఇళ్లను, రెండో విడతగా సోమవారం 2,50,893 ఇళ్లను పంపిణీ చేస్తోంది. ఈ సందర్భంగా నగరి మున్సిపాలిటీ ఓరుగంటాపురంలో జరిగిన గృహప్రవేశ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ పాల్గొని లబ్ధిదారులకు తాళాలు అందించి, వారిని సన్మానించారు.

సంబంధిత పోస్ట్