ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆదేశాల మేరకు పుత్తూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి జెండామాను వీధి, స్వామీ వీధి, శ్రీ రామ్ నగర్ లలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డు ఇన్చార్జి లక్ష్మణ్ ఆచారి, భాస్కర్, రమేష్, హరి, యాసిన్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.