నగరి అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసోత్సవం ఘనంగా నిర్వహణ

1చూసినవారు
నగరి అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసోత్సవం ఘనంగా నిర్వహణ
చిత్తూరు జిల్లా నగరి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని నెత్తం కండ్రిగ అంగన్వాడి కేంద్రంలో శనివారం, పోషణ మాసం సందర్భంగా అంగన్ వాడి ఉత్సవాన్ని సిడిపిఓ ఇందిరా ప్రియదర్శిని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు శ్రీదేవి, ఉమాశంకర్, ఐసిడిఎస్ సూపర్వైజర్ శంకరమ్మ, అంగన్వాడి టీచర్లు శాంతమ్మ, మల్లేశ్వరి, ఉపాధ్యాయులు, తల్లులు పాల్గొన్నారు. గర్భిణులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్