కరకంఠేశ్వర స్వామి శేష వాహనంపై ఊరేగింపు, భక్తుల పండుగ

849చూసినవారు
కరకంఠేశ్వర స్వామి శేష వాహనంపై ఊరేగింపు, భక్తుల పండుగ
చిత్తూరు జిల్లా నగరిలోని కామాక్షీ సమేత కరకంఠేశ్వర ఆలయంలో జరుగుతున్న పంగుణోత్తర కళ్యాణోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా, శుక్రవారం కరకంఠేశ్వర స్వామిని శేష వాహనంపై ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేక అర్చనలు జరిగాయి. ప్రత్యేక అలంకారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు కొబ్బరికాయలు కొట్టి, కర్పూర హారతులు సమర్పించారు. ఆలయ ధర్మకర్త సుబ్రమణ్యం ఏర్పాట్లను పర్యవేక్షించగా, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సంక్షేమ సేవా సంఘం వారు ఈ సేవకు ఉభయదారులుగా వ్యవహరించారు.

సంబంధిత పోస్ట్